• Mon. Apr 12th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

కోవిడ్ కష్ట కాలంలో ఆదుకున్న వారిని ప్రోత్సహించాలి

ByE69NEWS

Dec 29, 2020
కోవిడ్ కష్ట కాలంలో ఆదుకున్న వారిని ప్రోత్సహించాలి

: ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : కోవిడ్ కష్ట కాలంలో ధైర్యంగా సేవలు అందించిన వివిధ వర్గాల వారిని సమాజం గుర్తించాలని, వారి సేవలు చిరస్మరనీయంగా నిలుస్తాయని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ కు చెందిన అమన్ వేదిక అధ్వర్యంలో ‘కోవిడ్ వారియర్ల సత్కర’ కార్యక్రమం సోమవారం సితాఫలమండీ మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. కార్యక్రమంలో శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ కోవిడ్ వారియర్ల సేవలను అభినందించారు. వైద్య, మునిసిపల్, పోలీసు, సామాజిక్ సేవరంగాల వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆయా రంగాల వారిని సత్కరించడం తో పాటు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందించారు. కర్పరేటర్ కుమారి సామల హేమ, ఆమన్ వేదిక ప్రతినిధులు ఇందిర, ఎల్లన్న, బూస సుమలత, నమ్రత, ఆశ, రవూఫ్, రాము తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *