• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం

ByE69NEWS

Apr 7, 2021
అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం

జగ్గయ్యపేట రూరల్. అక్రమంగా తరలిస్తున్న 96 లక్షల రూపాయలు స్వాధీనం.
జగ్గయ్యపేట రూరల్.అక్రమంగా కారులో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మంగళవారం జరిగింది. చిల్లకల్లు ఎస్ఐ వి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ టీం సిబ్బంది ఏ వై నరసింహ నాయక్, యస్పీఓ నరసింహారావు, గోపి లతో కలిసి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో నలుగురు వ్యక్తులు 96 లక్షల 78,560 రూపాయలకు ఎటువంటి అధికారిక బిల్లులు లేకుండా తీసుకొని వెళుతుండగా వారిని విచారించగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన మిర్చిని మహారాష్ట్రలోని షోలాపూర్ లో అమ్మి రైతులకు ఆ నగదును అందించేందుకు తీసుకెళ్తున్న మని చెప్పారు. ఈ నగదుకు సరైన ఆధారాలు చూపలేకపోయినందున సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *