• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

కరపత్రాల ఆవిష్కరణ

ByE69NEWS

Apr 6, 2021
కరపత్రాల ఆవిష్కరణ

పల్లె పల్లెకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రకరపత్రాలు ఆవిష్కరణ
ఏప్రిల్ 12న నల్గొండ లో నీలి దండు కవాత్
ఏప్రిల్ 30 న అంబేద్కర్ జాతర
రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నల్గొండ జిల్లా కమీటి ఆద్వర్యంలో దొడ్డి కొమురయ్య భవనంలో
కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ నెల ను మహనీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని మండల కేంద్రాలనుండ ఏప్రిల్ 12న నీలి దండు కవాత్కుఅదిక సంఖ్యలో న పాల్గొనాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువతీ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు నల్గొండ జిల్లాలో ఏప్రిల్ 1నుండి 30వ తేతేదీ వరకు పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 30న మిర్యాలగూడ కేంద్రంలో పూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 12న జిల్లా కేంద్రంలో నీలి టీ షర్ట్ వాలంటీర్ల కావాత్ ఉంటుందని ఈ కార్యక్రమంలో జిల్లా లో సామాజిక ప్రజాసంఘాలు యాత్రకు సహకరించి జయప్రదం చేయాలని కోరినారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మరియు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్ల గొడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు , గిరిజనులు , మహిళలు , మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించీ దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మనువాదుల కుట్రలను అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ – ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మహనీయులు జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతి బా పూలే జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా అద్యక్షులు కొండేటి శ్రీను రాష్ట్ర కమిటీ సభ్యురాలు రెముడాల పరుషరాములు,జిల్లా నాయకులు బొల్లు రవీందర్, మురళి , పోలే సత్యనారాయణ అంజిబాబు,సురేష్ , రంజీత్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *