• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

చదివింది ఎమ్ టెక్ చేసేది చైన్ స్నాచింగ్

ByE69NEWS

Apr 5, 2021
చదివింది ఎమ్ టెక్ చేసేది చైన్ స్నాచింగ్

రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదు దొంగతనాలు, వారం రోజుల్లో ఇద్దరు దొంగలను పట్టుకొన్న ఆంధ్ర పోలీసులు, రెండు రాష్టాలలో రెండు లక్షల నలభై ఐదు వేల రికవరీ చేసిన జగ్గయ్యపేట పోలీసులు, సీ ఐ చంద్ర శేఖర్ పర్యవేక్షణ లో వారం లో దొంగతనం కేసు చేదించిన జగ్గయ్యపేట ఎస్సై చినబాబు, జగ్గయ్యపేట లో వారం రోజుల క్రితం హైదరాబాద్ రోడ్డు లో ఎస్ బి ఐ బ్యాంక్ పక్కన రాత్రి తొమ్మిది గంటల సమయం లో ఇంటి ముందు ఉన్న మహిళ మెడలో గొలుసు లాక్కొని బైకు పై వుండాయుంచిన ఇద్దరు కేటుగాళ్లు

వారం రోజుల వ్యవధి లోనే సీసీ కెమెరాల సహాయం తో కేసును చేధించి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా మరో నాల్గు దొంగతనాలు చేసిన విషయం బయటపడింది ,
జగ్గయ్యపేట లో రెండు నేరాలు, తెలంగాణ కోదాడ లో మూడు నేరాలకు పాల్పడినట్లు పోలీసులకు వెల్లడించిన కేటుగాళ్లు,

జగ్గయ్యపేట, కోదాడ లకు చెందిన నల్గురు మహిళలో లాక్కెళ్లిన 44 గ్రాముల బంగారు గొలుసులు, కోదాడ లో ఓ మొబైల్ షాప్ లో చోరీ చేసిన రెండు మొబైల్ ఫోన్లు, దొంగతనానికి వాడిన బైకు ను స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు

ఎమ్ టెక్, డిగ్రీ చదివి చెడు వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం దొంగతనాల బాట పట్టిన అనిల్, నాని ఇద్దర్ని జైలు బాట పట్టించిన ఖాకీలు

జగ్గయ్యపేట ఏ స్సై, చినబాబు కు, సీ సీ కెమెరా టెక్నీషియన్లు విష్ణు, సుధీర్ లకు రివర్డు లు అందజేసిన డి యస్ పి నాగేశ్వర రెడ్డి

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *