తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మ దిన వేడుకలను తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షుడు పగిడిపల్లి వినోద్ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో స్థానిక సేవసదనంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జి బొబ్బిల్లపాటి బాబురావు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి ప్రుట్స్ స్వీట్లు పంపిణీ చేశారు. తదనంతరం స్కూల్ ఆవరణం లో ఒక మొక్క నాటి కవిత కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత ప్రజా సేవకు మరింత అంకితం అవ్వాలని వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.ఈ కార్యక్రమం లో బీసీ సంఘం జిల్లా నాయకులు కంభం శివ తెరాస మండల యువజన నాయకులు కందుకూరి నాగబాబు తెరాస ఎస్సీ మండల నాయకులు నండ్రు బ్రమ్మయ్య కవిత ఆత్మీయ అభిమాని కందుకూరి శ్రీను జాగృతి యూత్ నాయకులు కందుకూరి మురళి కొండూరీ జమలయ్య . జగన్. తులసి రావు బొక్కా నాగవరున్ దోర్నాల దావీదు, సోనూసూద్, స్కూల్ ప్రిన్సిపాల్ స్వర్ణలత గారు పాల్గొన్నారు.
మధిర లో ఘనంగ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
