• Sun. Apr 11th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాల

ByE69NEWS

Mar 8, 2021
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాల

08-03-2021 భూపాలపల్లి రూరల్ .
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాలని బిజెపి రాష్ట్ర నాయకులు పర్కాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చాడ రఘునాథ్ రెడ్డి అన్నారు ,సోమవారం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చి౦తల విష్ణు ఆధ్వర్యంలో మండలంలోని కొంపెల్లి, గోర్లవీడు, నేరేడుపల్లి ,కొత్తపల్లి(sm), గ్రామాల్లోప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల ను విస్మరిస్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు అవసరమని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ద్వారా మనం సమస్యలను ప్రశ్నించుకొని సాధిద్దామని అన్నారు ప్రశ్న లేనప్పుడు పరిష్కారం దొరకదని ప్రశ్న ఉంటేనే పరిష్కారం వస్తుందని ఆయన అన్నారు ఉద్యోగుల పీఆర్సీ విషయంలో గానీ ఇంటికో ఉద్యోగం లో విషయంలోగానీ నిరుద్యోగుల విషయంలో గానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్బంగా రఘునాథ్ రెడ్డి అన్నారు,ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిన్నరాజయ్య ,ఎమ్మెల్సీ మండల కన్వీనర్ రాజు మండల ప్రధాన కార్యదర్శి కొమురయ్య జిల్లా నాయకుడు చుక్క రమేష్ గౌడ్ , వీరస్వామి ,ముందస్తు వంశీ ,విజయ్ రత్నాకర్ రఈసారి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes
Share to friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *