” లేపాక్షి ఏరియా హిందూపురం మండలం బాలంపల్లి గ్రామములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. సంస్థ నుండి శ్రీమతి మహాభూబీ మేడం, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఏరియా లీడర్ శ్రీ వన్నూరు స్వామి గారు, సి. ఓ. శ్రీ రామకృష్ణ గారు, మరియు ఏరియా సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాలంపల్లి గ్రామసర్పంచ్ శ్రీమతి వై. జయలక్ష్మి గారు, వైస్ సర్పంచ్ శ్రీమతి సుకన్య గారు, సచివాలయం సిబ్బంది వెనెల మేడం గారు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమమము లో, మహాభూబీ మేడం గారు, ఈ దినాన్ని ఉద్దేశించి నేటిసమాజములో మహిళలు, భాలికలు పట్ల జరుగు అకృత్యలు, అన్యాయాలు గురించి తెలుపుతూ, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు, చిన్నతనం నుంచే వారిని చైతన్య పరచాలని, అలాగే మహిళలు అందరూ జరిగే అన్యాయాన్ని, సమిష్టిగా, ఐక్యమత్యంగా,ఉండి సమస్యలను ఎదుర్కొని మహిళశక్తిని, మహిళలు యొక్క గొప్పతనాన్ని దేశమంతా చాటిచెప్పాలనీ, తెలియజేయడం జరిగింది.