ఈరోజు తిమ్మంపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాల పోస్టర్ ను దేవస్థాన కమిటీ అధ్యక్షుడు నూకల మల్లేష్ గ్రామస్తులతో పోస్టర్ ను ఆవిష్కరించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మంచినీటి సౌకర్యం,పందిర్లు,టెంట్లు వేస్తా మన్నారు.స్వామి వారి కళ్యాణానికి,జాతరకు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు. పండుగ రోజు సాయంత్రం దేవస్థాన గుట్ట చుట్టూ పెద్ద బండ్లు తిరుగుతాయన్నారు.కార్యక్రమంలో 5వార్డు సభ్యుడు సింగిరెడ్డి రవీందర్, కుంభోజి మహాదేవ్, రాజన్న, నాంపల్లి,కొమురయ్య, శివన్న,అర్జున్,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు