పున్నవల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం నందు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ సారథ్యంలో పున్నవల్లి గ్రామ సర్పంచ్ కోట మోహనరావు ఆధ్వర్యంలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఆధార్ నమోదు చేయించుకొని సుమారు15 మంది చిన్నారులను గుర్తించి స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఉచితంగా ఆధార్ నమోదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలోగ్రామ ఉప సర్పంచ్ రమాదేవి,ఆధార్ సేవ నిర్వాహకుడు షేక్ హుస్సేన్, గ్రామ వైసిపి నాయకులు కోట చిన బాబులు, కోట కోటేశ్వరరావు, కోట నాగేశ్వరరావు,కోట చిన్నోడు, అంగనవాడి టీచర్ బి సామ్రాజ్యం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.