
సామాజిక మార్పుకోసం ప్రయత్నం చేయాలి
గుత్తి కోట లో నివాసం ఉంటున్న సైదాభి గారికి రెండు కళ్ళు కనపడవు . బాధ్యత గా తీసికొని వారికి చేయుత నివ్వాలని గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకుడు , తెలుగు cvb tv న్యూస్ సీఈఓ విజయభాస్కర్ ఇలాంటి సామాజిక మార్పుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గుత్తి కోట వాస్తవ్యులు శ్రీ రామకృష్ణ ఒక సామాజిక కార్యకర్త గా గుత్తి కోట కోసం , అలాగే గుత్తి కోట ప్రజల కోసం ఆలోచించే ఒక మంచి మనసున్న మహారాజు లా ఎప్పుడూ నేనున్నానంటూ సైదా బీ కి వారి నివాస ముంటున్న ఇంటికి వెళ్లి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది, అలాగే మాజీ కరణం శ్రీ హనుమంతరావు కుమారుడు శ్రీ రంగనాథ్ 1000 రూపాయలు పంపించారు , మరియు గుత్తి కోటలో నివాసముంటున్న కీర్తిశేషులు శ్రీ చౌదరి సంగప్ప కుటుంబ సభ్యులు సైదాభి కి చీరలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ సామాజిక మార్పుకోసం కృషి చేయాలని తెలుగు cvb tv ఛానెల్ సీఈఓ విజయభాస్కర్ కోరుచున్నారు
More Stories
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్