E69NEWS

ప్రజా గొంతుక

సహకార పరపతి సంఘ (PACS) నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

సహకార పరపతి సంఘ (PACS) నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

సహకార పరపతి సంఘ (PACS) నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ (PACS) నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావువీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో నాబార్డ్ మరియు కెడిసిసి నిధులు రూ.20 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు గారు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం మరియు రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని కృషి చేస్తున్నారని , ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారు,గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులకు ఇబ్బంది లేకుండా తమ గ్రామ పరిధిలోని రైతు భరోసా కేంద్రాలతో పాటు ,ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అందుబాటులోకి రావడంతో రైతులకు మరింత మేలు కలుగుతుందన్నారు ,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షాహినాజ్ బేగం .అల్లూరు సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి . మండలం మాజీ జడ్పీటీసీ ముత్తా రెడ్డి గారు. ఆవుల రమేష్ గారు జడ్పీటీసీ అభ్యర్థి కీర్తి సౌజన్య గారు. భాస్కర్ రెడ్డి గారు. సిబ్బంది ,వైయస్ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Share to friends
x