
వరంగల్ లోని ఎంజిఎంలో కోవిడ్ వ్యాక్సిన్-ఎర్రబెల్లి దయాకర్
వరంగల్ లోని ఎంజిఎం హాస్పిటల్ లో కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
నిర్ణీత వైద్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మొదటి విడతగా, డాక్టర్ల చేత మంత్రి దగ్గరుండి వ్యాక్సినేషన్ చేయించారు.
ఎంజిఎంలో మంత్రి ఎర్రబెల్లితోపాటు, వరంగల్ మహానగర్ మేయర్ గుండా ప్రకాశ్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎంజిఎం సూపరింటెండెంట్, ఇతర డాక్టర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ ల కృషి వల్ల ఈ రోజు దేశ, మన రాష్ట్ర ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.*
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కోసం 9 నెలలుగా ఎదురు చూస్తున్నారు.
ఎంతో ముందుగానే మన దేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం, అవి అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయం.
ఈ రోజు నుంచి దేశంతో సహా, మన రాష్ట్రంలోనూ కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు ఇస్తున్నాం
More Stories
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ
గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక