E69NEWS

ప్రజా గొంతుక

వైయస్సార్ చేయూత పథక చెక్కులను పంపిణీ

వైయస్సార్ చేయూత పథక చెక్కులను పంపిణీ

వైయస్సార్ చేయూత పథక చెక్కులను పంపిణీ

వైయస్సార్ చేయూత పథక చెక్కులను పంపిణీ చేసిన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 15, 17,18 వార్డులకు చెందిన లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత పథకం కింద మంజూరైన చెక్కులను ,మంజూరు పత్రాలను మెప్మా అధికారులు, బ్యాంకుల సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పార్టీ రాష్ట్ర నాయకులు డా”మొండితోక అరుణ్ కుమార్ గారు పంపిణీ చేశారు ,

ఈ సందర్భంగా డా”అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద అక్క చెల్లి మన జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ చేయూత పథకానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ,

ఈ పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ళ వయసున్న అక్క చెల్లెమ్మలకు ఏడాది రూ.18750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందుతుందన్నారు ,ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తోడు ఆయా పథకాలు బ్యాంకుల నుంచి రుణాలు అందించి మహిళలను ఒౌత్సాహిక వ్యాపారులుగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు

Share to friends
x