
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్దులే విజయం సాధిస్తారు
రెడ్డిగూడెం మండలం లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్దులే విజయం సాధిస్తారని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెఢ్డి స్పష్టం చేశారు
రెఢ్ఢిగూడెం మండలం లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సరళిని మంగళవారం నాడు శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించారు
శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ
మండలం పరిధిలో 12 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయని సమర్ధులైన అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని ఈ నెల 21 న జరగనున్న ఎన్నికల్లో 12 గ్రామ పంచాయతీలను వైసిపీ బలపరిచిన అభ్యర్దులే సర్పంచ్ లుగా విజయం సాధించడం జరుగుతుందని స్పష్టం చేశారు
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన ప్రజలందరు మరోసారి వైసిపీ బలపరిచిన అభ్యర్దులకు పట్టం కడుతున్నారని రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభంజనం కొనసాగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాలంకీ మెహన మురళి కృష్ణ , పాలంకీ విజయబాస్కర రెడి స్థానిక నాయకులు పాల్గొన్నారు
More Stories
R. D. T. సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళదినోత్సవం
వైస్సార్సీపీ నాయకుల మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం