E69NEWS

ప్రజా గొంతుక

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం లోని అగ్రం పహాడ్ గ్రామం లో IKP ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గుడెపాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మెన్ కాంతాల కేశవరెడ్డి. వారు మాట్లాడుతూ రైతులకు కేంద్రంప్రభుత్వం నియమించిన నిబంధనల మేరకే రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నామని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టాల వలనే రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ మార్క సుమలత రజనికర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య రవి, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ రాజు, సొసైటీ వైస్ ఛైర్మెన్ రాజస్వామి, చౌళ్లపల్లి ఉపసర్పంచ్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share to friends
x