E69NEWS

ప్రజా గొంతుక

మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారం

మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారం

మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారం

జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో గత వారం క్రితం 97-98 బ్యాచ్ క్లాస్ మెంట్ మిత్రుడు కర్దూరి రాజు తండ్రి కర్దూరి ముత్తిరెడ్డి చనిపోయిన విషయం విదితమే.ఈ సందర్భంగా రాజు క్లాస్ మెంట్ మిత్రులు మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారముగా క్వింటా బియ్యం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం, ఉపాధ్యక్షుడు బక్కం కరుణాకర్ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి మా క్లాస్ మెంట్ మిత్రులు మిత్రురాల్లకు ఏదేని అవసరమైన, మేము సైతం మీ కోసం అంటూ క్లాస్ మెంట్ మిత్రులు మిత్రురాలు తలో కొంత ఆర్థిక సహాయం చేసి పాలుపంచుకున్నారని, ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సలీం, గోనె వెంకటేశ్వర్లు బక్కం కరుణాకర్, మురళి, బండమల్లు, సదానందం,బత్తిని రాజు, ప్రసన్న, అశోక్,శంకర్, పొన్నాల నాగయ్య వలీపాష, శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Share to friends
x