
మరిపెడ లో భారీ స్థాయిలో నల్లబెల్లం పట్టి వేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో భారీ స్థాయిలో నల్లబెల్లం పట్టుకున్నారు మరిపెడ పోలీసులు సుమారు 8 లక్షల విలువ చేసే 75 క్వింటాల నిషేధిత నల్లబెల్లం 5 క్వింటాళ్ల పటికీ స్వాధీనం చేసుకున్నారు మరిపెడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకట రమణ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ మరిపెడ పోలీసు వారు ఈ ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఎల్లంపేట స్టేజి మరియు మా కుల తండాలో ఏకకాలంలో రెండు వేరు వేరు చోట్ల దాడి చేసి ఒక డీసీఎం వాహనం మరియు మహీంద్రా మ్యాక్సీ ట్రాలీ వాహనం లో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం ని స్వాధీనం చేసుకున్నారు నలుగురు నిందితులను అరెస్టు చేసి రెండు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తెలియజేశారు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు ఆయన తెలియజేశారు స్వాధీనం చేసుకున్న నల్లబెల్లం మరియు పటికి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని వారు తెలియజేశారు ఇంతటి భారీ స్థాయిలో నల్ల బెల్లం పట్టుకున్న మరిపెడ సి ఐ సాగర్, ఎస్ ఐ లు సిరిసిల్ల అశోక్ బిక్షపతి మరియు సిబ్బంది ని డిఎస్పీ అభినందించారు
More Stories
4వ తేదీ న ఉప్పరపెల్లి క్రాస్ రోడ్ వద్ద గల కల్యాణ లక్మి ఫంక్షన్ హాల్ లో MLC ఎన్నికల భారీ బహిరంగ సభ
Trs ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వ్యతిరేఖంగా పనిచేస్తుంటే దానికి పల్లా రాజేశ్వరరెడ్డి వత్తాసు
సమస్యలపై అడిగితే విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి నెట్టేసిన జయ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం