• Thu. Oct 7th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

భార‌త్ బంద్‌ను విజ‌య‌వంతం చేయండి

ByE69NEWS

Sep 25, 2021

అఖిల ప‌క్ష స‌మావేశంలో నేత‌లు..
కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవ‌లంబిస్తున్న రైతు వ్య‌తిరేక విధాన‌ల‌ను నిర‌సిస్తూ దేశ వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని అఖిల ప‌క్ష నేత‌లు ప్ర‌జ‌ల‌ను కోరారు. శ‌నివారం కాంగ్రెస్ పార్టీ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌యంలో అఖిల ప‌క్ష నేత‌లు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొడ‌కండ్ల బ్లాక్ అధ్య‌క్షుడు రాపాక స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వాలు ప్ర‌జా వ్య‌తిరేకంగా ప‌రిపాల‌న సాగిస్తున్నాయ‌ని అన్నారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ పాల‌న‌లో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటాయ‌న్నారు. పెరిగిన ధ‌ర‌లో సామాన్య ప్ర‌జ‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొన‌లేని దుస్థితికి దిగ‌జారి పోయార‌ని అన్నారు. వంట నూనే ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయని, డిజిల్ పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయ‌ని, ఎరువులు ధ‌ర‌లు సామాన్య రైతుకు అంద‌నంత ఎత్తుకు పెరిగాయ‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో స‌న్న చిన్న కారు రైతులు బ‌తుక‌లేని ప‌రిస్థితిలోకి నెట్ట‌బ‌డ్డార‌ని ఆరోపించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో కార్పోరేట్ల‌కు కాసులు కురిపించేందుకు న‌రేంద్ర మోడీ నిర్ణ‌యం తీసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌ల‌తో, త‌గ్గిన గిట్టుబాటు ధ‌ర‌ల‌తో కేంధ్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు సామాన్య రైతుల న‌డ్డి విరుస్తున్నార‌ని అన్నారు. వ్య‌వ‌సాయ చేయాలంటేనే రైతుల గుండే గుభేల్ అంటుంద‌న్నారు. వ‌రి పంట‌ను సాగు చేయ‌కుండా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌ను నిరోధిస్తున్నాయ‌ని అన్నారు. కేంధ్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెంట‌నే ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను వెన‌క్కి తీసుకుని దేశ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం పని చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంధ్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను నిర‌సిస్తూ ఈనెల 27న జ‌రిగే భార‌త్ బంద్‌ను కార్మిక క‌ర్ష‌కులు విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు గిరిగాని కుమారస్వామి, బైరి భార్గ‌వ్‌, పులి గ‌ణేష్, గుగ్గిల్ల ఆదినారాయ‌ణ‌, ధ‌రావ‌త్ సురేష్‌, సీపీఎం నేత సోమ స‌త్యం, సింగార‌పు ర‌మేష్‌, చిట్యాల సోమ‌న్న, మాచ‌ర్ల సారయ్య‌, బెల్లి సంప‌త్‌, టీడీపీ మండ‌ల అధ్య‌క్షుడు ల్యాబ్ వెంక‌న్న‌, ఘ‌న‌పురం ఎల్ల‌య్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *