E69NEWS

ప్రజా గొంతుక

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ఎర్రుపాలెం: మండలం పరిధిలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన ఎర్రుపాలెం మాజీ సొసైటీ చైర్మన్ కొండపాటి శ్రీనివాసరావు(44) బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు రేమిడి చర్ల గ్రామం లోని ఊరు చెరువు లో పడి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎరుపాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయగా గురువారం శ్రీనివాస రావు మృతదేహం చెరువులో తేలియాడటాన్ని గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపడంతో పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. మృతునికి భార్య చంటి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసును మధిర రూరల్ ఎస్ఐ ఎం రమేష్ కుమార్ ఆర్, హెడ్ కానిస్టేబుల్ ఇక్బాల్, కానిస్టేబుల్ శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.

Share to friends
x