
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ
చేపట్టి బ్రోచర్ ఆవిష్కరించిన రిటైర్డ్ డి ఎఫ్ ఓ ఓ పురుషోత్తం మరియు సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మికిరణ్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర రెడ్డి పురం, భైరాన్ పల్లి మీదుగా దాదాపు 13 కి.మీ ప్రయాణించి సిద్ధాపూర్ చేరుకొన్నారు. జన విజ్ఞాన వేదిక వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు ధర్మ ప్రకాష్ గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఈకార్యక్రమాన్ని మా ఊర్లో నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉందని మా ఊరి ప్రజలకు గర్వకారణంగా ఉందని రాబోయే రోజుల్లో పర్యావరణంపట్ల ఎటువంటి కార్యక్రమానికైన మా గ్రామం తరపున సహకరిస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం సిద్ధాపూర్ గుట్టల సమీపంలోని చిత్తడి నేలలను పరిశీలించి వాటి ఆవశ్యకతను రిటైర్డ్ డి.ఎఫ్.ఓ పురుషోత్తం గారు వివరించారు. పక్షులకు సంబంధించి కొన్ని రకాల వలస పక్షులను కనుగొని అవి ఎక్కడ నుండి మన చెరువుల వద్దకు వచ్చాయో దానికి సంబంధించిన వివరాలను ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు వివరించారు. చిత్తడినేలలో చెరువులో పరిరక్షణలో భాగంగా సిద్దాపూర్ లోని కలుషితమైన ఒక చెరువును దత్తత తీసుకున్నట్లు పైలెట్ ప్రాజెక్టు కింద దాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వన సేవా సమితి కార్యదర్శి జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నరేష్ గారు పేర్కొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞను డి.ఎఫ్.ఓ పురుషోత్తం గారు అందరిచేత చేయించి ముగింపు సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హరి కాంత్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ చీకటి రమేష్ వార్డు మెంబర్లు సూరమ్మ ఆనందం అభిలాశ్ శంకర్ సురేష్ మాజీ ఎస్ఎంసి చైర్మన్ రామకృష్ణ రాకేష్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు పరికిపండ్ల వేణు ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు పర్యావరణ పరిరక్షణ బాధ్యులు డా.సామల శశిధర్ రెడ్డి వినియోగదారుల ఫోరం జిల్లా కార్యదర్శి దామోదర్ వరంగల్ సైకిల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఎన్ ఐ టి సైకిల్ వాకర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష
- ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
- చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు
- శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
- రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థాయి కోకో అసోసియేషన్ అధ్యక్షులు
- వింత జీవి ప్రసవం
- పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
- మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది
- పామిడి మండలం తహసిల్దార్ కార్యాలయం నందు మూడో విడత కోవిడ్ వాక్సినేషన్
- సోమిడి లో మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవం
More Stories
చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్