E69NEWS

ప్రజా గొంతుక

పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధరను పెంచడం వలన సామాన్య ప్రజల పైన తీవ్రమైన అధిక భారం

పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధరను పెంచడం వలన సామాన్య ప్రజల పైన తీవ్రమైన అధిక భారం

పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధరను పెంచడం వలన సామాన్య ప్రజల పైన తీవ్రమైన అధిక భారం

E69 న్యూస్. పరకాల రిపోర్టర్. కేంద్ర ప్రభుత్వం రోజు పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధరను పెంచడం వలన సామాన్య ప్రజల పైన తీవ్రమైన అధిక భారం పడుతుందని ఎంసిపిఐ యు శాయంపేట మండల కార్యదర్శి ఎండి ఉస్మాన్ అన్నారు. ఈరోజు శాయంపేట మండలం వసంతపూర్ గ్రామంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లో ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండి చమురు సంస్థలు ఇరవై ఆరు సార్లు ధరలు పెంచడం జరిగింది. పెట్రోల్ ధర వంద రూపాయలు అయిందని ప్రపంచంలో కరోనా విపత్తు తో ప్రజలు ఆర్థికంగా వెనుకబడి పోయారు. రోజురోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజల పైన ఆర్థిక భారం పడుతుందని అన్నారు‌. బయట దేశాలు చమురు ధరలు రోజు తగ్గిపోతుంటే మన దేశంలో మాత్రం పూర్తిగా నియంత్రణ లేకుండా పోయిందని 33శాతం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం టాక్సీల పేరుతో చాలా డబ్బలు వసూలు చేసి ప్రజలను దోచుకుంటున్నారు అని అన్నారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ గ్యాస్ జీఎస్టీ​పరిధిలోకి తెస్తూ పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలని లేనిచో ఎంసిపిఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు ఈ సమావేశం లో డోలె రామారావు, సతీష్, భుజంగరావు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Share to friends
x