• Sun. Oct 10th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

పట్టుగూళ్ల రైతుల సమస్యలు పరిష్కరించాలని DHSO కార్యాలయం ముందు రైతుల ధర్నా

ByE69NEWS

Sep 25, 2021

ధర్నాకు మద్దతు తెలిపిన తెలంగాణ రైతు సంఘం.
తెలంగాణ పట్టు రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టు రైతులు జనగామ పట్టణం లోని ప్రెస్టన్ స్కూల్ ఆవరణ నుండి బస్ స్టాండ్ చౌరస్తా మీదుగా హైద్రాబాద్ రోడ్డుకు గల పట్టుగూళ్ల విక్రయ కేంద్రం (మార్కెట్) వరకు రైతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం విక్రయ మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈధర్నాకు తెలంగాణ రైతు సంఘం మద్దతు పలికింది. ఈసందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సాదం జంపన్న చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బూడిద గోపి హాజరై ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతు జనగామ మార్కెట్కు వస్తున్న పట్టుగూళ్ల రైతులను వ్యాపారులు అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని అన్నారు. మన పక్కనున్న రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పట్టు పరిశ్రమ అభివృద్ధి దిశగా జరుగుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.మార్కెట్లో ట్రేడర్స్ సిండికేట్ గా తయారై తక్కువ ధరకు వేలంపాటలు పడుతున్నారని ఇతర మార్కెట్లలో క్వింటాలుకు 60 వేల ధర పలికే జనగామ మార్కెట్ లో 40 వేలకు మించి రావడం లేదని రైతులు తెలుపుతున్నానని ఒక రైతు ఒక సంవత్సరానికి సుమారు రెండు లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సరుకు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఉన్నప్పటికిని ఇవ్వకుండా నెలల తరబడి రైతులను తిప్పుకుంటూ న్నారని తెలిపారు.అలాగే వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
జల్లి గుళ్లను ఇతర మార్కెట్లలో కొనుగోలుదారుల సగం ఇచ్చి ట్రేడర్స్ తీసుకుంటే జనగామ జిల్లాలో మాత్రం అతి తక్కువ ధరకే తీసుకుంటున్నారని తెలిపారు. అందుకోసం సెరి కల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు పారదర్శకంగా వ్యవరించి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2018 నుండి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ డబ్బులను విడుదల చేయాలని పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్ల నిర్మాణం కోసం రైతులకు ప్రోత్సాహకంగా వంద శాతం సబ్సిడీతో 10 లక్షల రుణ సహాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పట్టు రైతుల సంక్షేమ సంఘం నాయకులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మండల రాజు ,పార్థసారథి రెడ్డి, ఉపేందర్ రెడ్డి లింగస్వమి మనోహర్ లక్మారెడ్డి రవికుమార్ ఇతర రైతులు పాల్గొవడం జరిగింది.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *