E69NEWS

ప్రజా గొంతుక

నిత్యావసర వస్తువుల, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి

నిత్యావసర వస్తువుల, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి

నిత్యావసర వస్తువుల, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి

Cpm కేంద్ర కమిటీ సభ్యులు G.నాగయ్య డిమాండ్. కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే డిమాండ్ చేశారు.

దివి: 11-02-2021 గురువారం రోజున పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు G. నాగయ్య ముఖ్య అతిధిగా పాల్గొని పాట్లాడుతూ పెంచిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తక్షణనే తగ్గించాలని, మోటార్ వాహన చట్టం 2019 వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇప్పటికే కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఇంకా అనేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధారలాటి పాటు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులకు నష్టం చేసే మోటర్ వాహన చట్టం 2019 ని తీసుకోవాలని డిమాండ్ చేశారు*
రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాల సవరణలు నిలిపివేయాలని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడ కుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు రాపర్తి సోమన్న, p.ఉపేందర్, G.బాపురెడ్డి, S.రమేష్, సాంబరాజు యాదగిరి, R.మీట్యానాయక్ B.నరేందర్, P.నాగరాజు, మండల కార్యదర్శులు ch.సోమన్న, K.యాకన్న, B.కరుణాకర్, ప్రజాసంఘాల నాయకులు J.ప్రకాష్, B.గణేష్, J.రమేష్, B.చందు నాయక్, M.రమేష్, తదితరులు పాల్గొన్నారు

Share to friends
x