E69NEWS

ప్రజా గొంతుక

దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి వర్ధన్నపేట సి ఐ విశ్వేశ్వర్

దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి వర్ధన్నపేట సి ఐ విశ్వేశ్వర్

దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి వర్ధన్నపేట సి ఐ విశ్వేశ్వర్

జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండల ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి-సి.ఐ విశ్వేశ్వర్ వర్ధన్నపేటజనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండల ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట సి.ఐ విశ్వేశ్వర్ కొన్ని జాగ్రత్తలు సూచించారు.1. వరుస ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు లు జరుగుతున్నవి కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు రీతులు అప్రమత్తంగా ఉండాలి.2. గ్రామ సర్పంచులు తమ తమ గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలి.3.ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేక కొత్త వ్యక్తులు కనపడితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగలరు,4.గ్రామాల్లోని ఆలయాల వద్ద హుండీలో డబ్బులు ఎక్కువ మొత్తంలో ఉంచకూడదు. అంతే విలువైన దేవుడు ఆభరణాలు కూడా ఉంచకుండా జాగ్రత్తపడండి.5.మహిళలు, చిన్నపిల్లలు ఆభరణాలు ధరించి బయటకి రాకుండా చూసుకోవాలి.6.అన్నీ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు బాధ్యతగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి. ఆటో డ్రైవర్లు గ్రామాల్లో కి వచ్చి పోయే కొత్త వ్యక్తులు గమనిస్తూ అట్టి సమాచారాన్ని పోలీసులకు అందించగలరు.7. అదేవిధంగా గ్రామాల్లోని వీధి దీపాలు వెలిగేలా చూసుకోవాలి.8.యువత అప్రమత్తంగా ఉండి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకోగలరు.9. ప్రతి గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాల్లో, గ్రామ కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను పనిచేసే విధంగా చూస్తూ కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగలరు.10. ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం, మనం అలిసిపోయి నిద్ర పోయినా సీసీ కెమెరా ఎప్పుడూ పని చేస్తూ ఉంటుంది11. ఒకవేళ ఇంట్లో విలువైన వస్తువులు బంగారం మరియు డబ్బులు ఉన్నచో దయచేసి బ్యాంకు లో కానీ లాకర్ లో కానీ పెట్టుకోగలరు.12. మన పోలీస్ స్టేషన్ పరిధిలోకి కొత్తగా దొంగల ముఠాలు వచ్చినట్టు సమాచారం, దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండవలెను.13. గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచ్ బాధ్యత వహించి, ఊర్లో దండోరా వేయించి ఎటువంటి నేరాలు మరియు దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి. దొంగతనాలు జరగకుండా ఉండడానికి మీ సహకారంతో మాకు ఎంతో అవసరం దయచేసి పోలిస్ వారికీ సహకరించగలరని విన్నపం చేశారు.

Share to friends
x