E69NEWS

ప్రజా గొంతుక

జాతీయ ఫెలోషిప్స్ లో తెలంగాణ విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరుతూ యూ.జీ.సి.జాయింట్ సెక్రటరీ కి ఎస్.ఎఫ్.ఐ. వినతి

|| #Telugu News || %Latest News @%Telangana News%|| #Today News ||

జాతీయ ఫెలోషిప్స్ లో తెలంగాణ విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరుతూ యూ.జీ.సి.జాయింట్ సెక్రటరీ కి ఎస్.ఎఫ్.ఐ. వినతి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ(హెచ్.సి.యు) భూములు కబ్జా కాకుండా కాపాడాలని

—————————— హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ భూములను కోంతమంది అక్రమార్కులు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వారి యూనివర్శీటీ భూములను కాపాడాలని, తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు జాతీయ ఫెలోషిప్స్ ఇవ్వాలని, పెండింగ్ ఫెలోషిప్స్ అందించాలని న్యూ ఢిల్లీలో కోరుతూ యూనివర్శీటీ గ్రాంట్స్ కమిషన్(యూ.జీ.సి.) జాయింట్ సెక్రటరీ త్రిపాఠి కి వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్ష్యా,కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు లు మాట్లడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ పరిధిలో 18 ఏకరాల భూమిని కబ్జాదారులు యూనివర్శీటీ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ,ఈ కబ్జా చేయడం మొదటిసారి కాదని పదే పదే కబ్జా చేస్తున్న ,యూనివర్శీటీ అడ్మిస్ర్టేషన్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు అనేక రోజుల నుండి పోరాటం చేస్తున్నారని ,యూ.జీ.సి కలుగజేసుకోని యూనివర్శీటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర యూనివర్శీటీలలో చదువుతున్న విద్యార్ధులకు జాతీయ స్థాయిలో ఫెలోషిప్స్ ఇవ్వడంలో త్రీవమైన అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత కోన్ని సంవత్సరాల నుండి యూజీసీ నాన్ నెట్ ఫెలోషిప్స్ లేవని జాతీయ ఫెలోషిప్స్ కూడా మోడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి విద్యార్ధులకు అందడం లేదని అన్నారు.రాష్ట్ర యూనివర్శీటీలకు నాన్ నెట్ ఫెలోషిప్స్ అందడం లేదని ,ఎస్సీ, ఓబిసి,మైనార్టీ విద్యార్ధులకు వచ్చే ఫెలోషిప్స్ కూడా గత 3 సంవత్సరాల నుండి విడుదల కావడం లేదని అన్నారు. జాతీయ ఫెలోషిప్స్ నోటీఫికేషన్స్ రెగ్యూలర్ గా విడుదల చేయకపోవడం మూలంగా చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు.కోంత మంది తమ పి.హెచ్.డీ.లు సబ్మిట్ చేసిన కూడా ఫెలోషిప్స్ రాలేదన్నారు. ఫెలోషిప్ లలో నెట్ ఉంటేనే ఫెలోషిప్ అనే నిబంధన తీసివేయాలి, రాష్ట్ర యూనివర్శీటీలకు జాతీయ యూనివర్శీటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు కూడా తగ్గాయన్నారు. కరోనా కాలం నుండి ఫెలోషిప్స్ అన్ని పెండింగ్ ఉన్నాయని వాటిని విడుదల చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.విప్లవ్ కుమార్, రాష్ట్రకార్యదర్శి ఎ.విజయ్ ఎస్.ఎఫ్.ఐ. సెంట్రల్ కమిటీ సభ్యులు ,హెచ్.సి.యు. పి.హెచ్.డి.స్కాలర్ జాన్ బషిర్ పాల్గోన్నారు..

Share to friends
x