• Wed. Oct 13th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

చాకలి ఐలమ్మ కు ఘనంగా నివాళులు అర్పించిన బయ్యారం మండల రజక సంఘం

ByE69NEWS

Sep 26, 2021

నియంతృత్వ నిజాం ను ఎదిరించి, భూమికోసం, భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన, మహిళా లోకానికి స్పూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ జయంతిని నేడు మండలంలోని రజక సంఘం కార్యాలయంలో రజక సంఘం జిల్లా నాయకులు తంగెళ్ళపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా రజక సంఘం నాయకులు ఉపేందర్ మాట్లాడుతూ… నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆనాడు చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ధీర వనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి ని మననం చేసుకుంటూ..
ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరగాడెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకో గలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ మాత్రమే అని సందర్భంగా చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ లో రజకులను కూడా చేర్చి తగు న్యాయం చేయాలని అది మా రజకుల చిరకాల వాంఛ అని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు మాదారపు లచ్చయ్య, ఉపాధ్యక్షులు
లోకుంట్ల సోములు, ప్రధాన కార్యదర్శి మాదారపు రమేష్, సభ్యులు లోకుంట్ల రవి, చీనూరి శివయ్య, మాదారపు వెంకటప్పయ్య, మాదారపు వీరన్న, కుమ్మరి కుంట్ల వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *