• Sat. Oct 9th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పరిపాలనలో బాగస్వామ్యం కల్పించాలి-TRRS

ByE69NEWS

Sep 25, 2021

హైదరాబాద్ హైదర్ గూడ NSS ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు ముఖ్యఅతిథులుగా అఖిల భారత ధోభీ మహా సమాజ్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉళ్ళెంగల యాదగిరి,TRRS రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక,TRRS రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నర్సిములు హాజరయ్యారు.
రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ
గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పరిపాలనలో బాగస్వామ్యం కల్పించాలి అన్నారు.
జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అన్నారుఉపాధ్యక్షులు ఉళ్ళెంగల యాదగిరి మాట్లాడుతూ పాలకుర్తి అసెంబ్లీ స్థానాన్ని అన్ని పార్టీలు రజకులకే కేటాయించాలని కోరారు. రజకులకు తక్షణమే రక్షణ చట్టం కల్పించాలని అన్నారు.
రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నర్సిములు మాట్లాడుతూ రజక కులస్తులను ఎస్సీ జాబితాలోకి చెర్చే అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు.
రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన 450 కోట్లు తక్షణమే విడుదల చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు.
🎤 హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్ మాట్లాడుతూ రజక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న వారిలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాషరాజుల యాదగిరి, రాష్ట్ర సంయుక్త ప్రచార కార్యదర్శి శేఖర్ ప్రసాద్,హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నేతికుంట పరమేశ్, నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్లనర్వ శ్రీశైలం మరియు బొల్లారపు ఉమేష్ హర్ష.

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *