E69NEWS

ప్రజా గొంతుక

కార్మిక వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలి-Citu రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ డిమాండ్

కార్మిక వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలి-Citu రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ డిమాండ్

కార్మిక వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలి-Citu రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ డిమాండ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలను ఉపసంహరించుకోవాలని,Citu రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక పోరుయాత్ర రాష్ట్ర జీపు జాతా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రను మద్దతు తెలుపుతూ ఆశీర్వదించాలని కోరారు.

దివి: 30-01-2021 శనివారం రోజున ఉదయం: 8-30 గంటలకు Citu కార్మిక, కర్షక పోరుయాత్ర రాష్ట్ర జీపు జాతా జనగామకు చేరుకుందని అనంతరం హైదరాబాద్ రోడ్డు కళ్లెం కమాన్ నుండి RTC చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు పెద్దఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ఈసంధర్బంగా Citu రాష్ట్ర కార్యదర్శి J.వెంకటేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి కార్మికుల, కర్షకుల ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి Citu జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి J.వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ సిక్రి సరిహద్దు వద్ద ట్రాక్టర్లతో వచ్చిన రైతులపై పోలీసులు లాఠీలు, కర్రలతో కొట్టి, టియర్ గ్యాస్ ప్రయోగించిన మోడీ సర్కార్ ఎంత దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని, దేశాన్ని మతాల పేరుతో విభజించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులు రోడ్లపైకి వచ్చి రాత్రిoబవళ్ళు ఆందోళనలు చేస్తున్న కేంద్రానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దురదుష్టకరమని విమర్శించారు. దేశ వ్యవసాయ రంగాన్ని, రైతు ఉనికిని దెబ్బతీసే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, గిట్టుబాటు ధరల గ్యారంటీ కోసం చట్టం చేయాలని 2 నెలలుగా సాగుతున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాల వల్ల రైతులు హక్కుగా పొందుతున్న (MSP) మద్దతు ధర రద్దవుతుందని అన్నారు. పంటల ధరలు తగ్గితే ప్రభుత్వం మార్కెట్ లో కొనుగోలు చేయదని తెలిపారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతులపైన, వారి భూములపైన ఆధిపత్యం వహిస్తాయని అన్నారు. రైతుల నుండి కారుచౌకగా వ్యవసాయోత్పత్తులను కొని వినియోగదారులపై భారంమోపి అధికలాభాలను కోళ్ల గొడతారని తెలిపారు. రైతులు అప్పులపాలై, దివాళాతీసి ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ బహినపడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని దీనివల్ల ప్రజలకు తినడానికి తిండికూడా కరువవుతుందన్నారు. కార్మికులు, ఉద్యోగులపై ధరల భారం పడుతుందని, ఇది ఆకలి చావులకు దారి తీస్తుందని అన్నారు. ఈ చట్టాల పర్యవసానంగా రైతులు భూములు కోల్పోతారని, కౌలు రైతులకు చేసుకోవడానికి భూములు దొరకవని అన్నారు. వ్యవసాయ చట్టాలు కొనసాగడమంటే భారతదేశ ఆర్ధిక వ్యవస్థను కొద్దిమంది కొల్లగొట్టడమేనన్నారు. వ్యవసాయం, విద్య, విద్యుత్ లపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలది, కానీ ఈ కొత్త చట్టాలతో కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని హరించిందన్నారు. కేంద్ర BJP రాజ్యసభలో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈచట్టాలను ఆమోదింపచేసుకుందన్నారు. పార్లమెంట్ సభ్యులకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదని, కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈచట్టాలకు ఆర్డినెన్సులను తెచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చించి ఈచట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో Citu రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, పుప్పాల, Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, Citu జిల్లా నాయకులు జోగు ప్రకాష్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, కల్లుగీతకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి, Cpm మండల కార్యదర్శి P.ఉపేందర్, KVPS జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్, NPRD జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి B.చందు నాయక్, KGKS జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య, ఆవాజ్ జిల్లా నాయకులు MD.అజారోద్దిన్, Sfi జిల్లా నాయకులు దడిగే సందీప్,పల్లెర్ల లలిత, పందిళ్ల కల్యాణి, కార్మికులు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share to friends
x