
కలెక్ట్ రేట్ వద్ద రూరల్ జిల్లా రైతులు నిరసన కార్యక్రమం
ఈరోజు ఆత్మకూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లేతాకుల సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎంపీపీ మార్క సుమలత రజనికర్, జెడ్పిటిసి రాధిక రాజు, గుడేపాడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఎంకతాల రవీందర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు హర్షం వరుణ్ గాంధీ,
ఎంపిటిసి భయ్యా రాజు, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి అంకూస్, మండల నాయకులు బొల్లోజు కుమారస్వామి, నత్తి సుధాకర్, ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పైడి, ప్రవీణ్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు సంజీవ రెడ్డి మాట్లాడుతూ
తేదీ
29/ 12/2020 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్ట్ రేట్ వద్ద రూరల్ జిల్లా రైతులు నిరసన కార్యక్రమం చేపట్టనైనది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి,
వర్ధన్నపేట శాసన సభ్యులు ఆరూరి రమేష్,
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర రమణరెడ్డి,
వరంగల్ రూరల్ జిల్లా చైర్ పర్సన్ గండ్ర జ్యోతి గార్లు పాల్గొనడం జరిగుతుంది.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలేక్టరేట్ వద్ద నిరసన తేలపడం జరుగుతుంది..
కేంద్ర ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్ నుండి గోదావరి వద్ద మూడు టి.ఎం.సిల నీళ్లు తీసుకొనుటకు అభ్యంతరం చెప్పడం వలన వరంగల్ రూరల్ జిల్లా ఎడారిగా మారుతుందని రైతులు గ్రహించి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టుచున్నారు.
కావున ఈ నిరసన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి సభ్యులు ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ