
ఎన్నికలలో పోటీ చేస్తే భయబ్రాంతులకు గురి చేస్తారా-తంగిరాల సౌమ్య
ఎన్నికలలో పోటీ చేస్తే భయబ్రాంతులకు గురి చేస్తారా
మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య.
నందిగామ మండలం : కంచెల గ్రామము తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పెర్న వెంకటలక్ష్మీ,రమణ లకు సంబంధించిన రెండు బైకులను నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు తగలబెట్టిన ప్రదేశాన్ని తెదేపా నేతలతో కలిసి పరిశీలించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య
తంగిరాల సౌమ్య మాట్లాడుతూ
ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం
ఇటువంటి చర్యలకు పాల్పడటం వారి పైశాచికత్వానికి నిదర్శనం
గతంలో ఎన్నడూ గ్రామంలో ఈ విధంగా జరగలేదు
హుందాతనంగా ఎన్నికలలో పోటీ చేయాలి తప్ప ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు
ప్రజలు వీటిని తెలుసుకొని రేపు ఓటు రూపంలో బుద్ది చెప్పాలి
పోలీస్ యంత్రాగం వీటిపై దృష్టి పెట్టి శాంతి భద్రతల మధ్య ఎన్నికలను నిర్వహించాలని ఆమె తెలియజేసారు
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం