
ఊరుగొండ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు
సయ్యద్ వలి…
వరంగల్ రూరల్ జిల్లా..
పరకాల నియోజకవర్గం.
దామెర మండలం ఊరుగొండ గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు పరకాల ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒకే ఒక పండుగ క్రిస్మస్నేనన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ అన్ని పండుగలను ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ పండుగలు ప్రభుత్వ నిర్వహిస్తుందన్నారు.
క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు,రంజాన్ పండుగకు ముస్లింలకు, బతుకమ్మ పండుగకు హిందువులకు, కానుకగా బట్టలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు.
అనంతరం క్రిస్ట్ యూత్ ఆర్గనైశేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,స్థానిక సర్పంచ్,వివిధ గ్రామాల సర్పంచులు
,ఎంపిటిసిలు,స్థానిక ఫాస్టర్లు,
తెరాస నాయకులు,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు